కారణాలు ఏమైనా కావొచ్చు, కారకులు ఎవరైనా కావొచ్చు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) లైఫ్, కెరీర్ పూర్తిగా డిస్ట్రబ్ అయ్యాయి. అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ అరెస్టు అయ్యి.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు. అయితే ఆయన జీవితం, కెరీర్ మళ్లీ గతంలో మాదిరిగా ఉంటాయా అనే డౌట్ చాలామందికి ఉంది. ఆయన కూడా బయటకు వచ్చాక పెద్దగా అందుబాటులో లేరు. అయితే ఇప్పుడు యాక్టివ్ అయ్యారు.
బెయిల్‌తో జైలు నుండి బయటకు వచ్చిన జానీ మాస్టర్ మళ్లీ నార్మల్ లైఫ్‌ను లీడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తన వర్క్‌లో నిమగ్నమవుతున్నారు. వర్క్ తోనే మాట్లాడాలని నిర్ణయించుకున్న జానీ మాస్టర్.. ‘బ్యాక్ టు ది బీట్స్ ఇన్ ఫుల్ వ్యాల్యూమ్’ అంటూ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. దాంతోపాటు బిగ్ సర్‌ప్రైజ్ అని కూడా రాసుకొచ్చారు.
దీంతో ఏంటా సర్‌ప్రైజ్ అనే చర్చ మొదలైంది. ఏ సినిమా ఓకే చేశారు, లేకపోతే ఏదైనా కొత్త షో చేస్తున్నారా? లేదంటే గతంలో ఓకే చేసిన సినిమా పనులు ఇప్పుడు ప్రారంభిస్తున్నారా లాంటి డౌట్స్ ఉన్నాయి. ఆయన అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది అయితే ఓ బాలీవుడ్ సినిమా కోసం ఈ అడుగులు అని అంటున్నారు. త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన యువతిపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశారనేది ప్రధానమైన ఆరోపణ. సదరు యువతి జానీ మాస్టర్‌పై కేసు పెట్టడంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. ‘తిరు చిట్రంబళం’ (Thiruchitrambalam) సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు ప్రదానాన్ని కూడా నిలిపేశారు. ఇలాంటి గడ్డు కాలం నుండి జానీ మాస్టర్ ఎలా బయటపడతారో చూడాలి. అలాగే కేసు ఎటువైపు వెళ్తుందో కూడా తెలియాలి. ఎందుకంటే తప్పు చేస్తే శిక్ష పడాలి, నిరపరాధికి పడకూడదు కూడా.