Jani Master: జానీ మాస్టర్‌ వేధింపుల కేసు… కొత్త పాయింట్‌ లాగి చర్చ పెట్టిన ఆయన భార్య

జానీ మాస్టర్‌ (Jani Master) Laiగిక వేధింపుల విషయంలో ఇన్నాళ్లుగా అవతలివైపు అమ్మాయి గురించి పేరు లేకుండానే వార్తలు వచ్చేవి. అయితే ఆమె ఈ మధ్య ముసుగు తీసేసి మరీ ముందుకు వచ్చారు. తనను ఎలా ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది, తాను ఎందుకలా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది లాంటి విషయాలు వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెకు కౌంటర్‌గా జానీ మాస్టర్‌ భార్య సుమలత అలియాస్‌ అయేషా మీడియా ముందుకు వచ్చారు.

Jani Master

ఓ వీడియో ఛానల్‌తో సుమలత మాట్లాడుతూ జానీ మాస్టర్‌ మాజీ అసిస్టెంట్‌ చెప్పిన విషయాలకు సమాధానాలు ఇచ్చారు. దీంతో ఈమె చెప్పింది కూడా నిజమే కదా సర్‌ అనే సమాధానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైన పాయింట్‌ ఏంటంటే.. రెండేళ్ల క్రితం జానీ మాస్టర్‌ టీమ్‌ నుండి దూరమైతే.. అన్నేళ్లు ఎందుకు ఆగి పోలీసుల ముందుకు ఎందుకొచ్చినట్లు అనే ప్రశ్న. దీంతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఆమె చెప్పారు. Laiగిక వేధింపుల ఆరోపణలపై పోక్సో చట్టం కింద అరెస్టయి, కొన్ని రోజులు జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన భార్యతో కలసి ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వెంటనే ఆయన మాజీ అసిస్టెంట్‌ కూడా యూట్యూబ్‌ ఛానల్‌ ముందుకు వచ్చారు. దీనికి సమాధానమే ఇప్పుడు జానీ మాస్టర్‌ భార్య క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్‌పై ఆ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ మనసు పడిందని, అందుకే ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తొలిగించారని సుమలత తెలిపారు. ఆరేళ్లు తన భర్త Laiగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెబుతోందని,

రెండేళ్లుగా తన భర్తతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారామె. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తొలిగించి, దూరం పెట్టామని, ఆ తర్వాత ఫిర్యాదు చేయడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. ఆ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌కి సభ్యత్వం ఇప్పించి, ఆమె చెల్లెలి చదువు కోసం కూడా జానీ మాస్టర్ సాయం చేశారని ఆయన భార్య చెబుతున్నారు. మరి దీనికి ఆ ఆసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ సమాధానం చెబుతారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus