టాలీవుడ్‌లో సంచలనంగా మారిన సంధ్య థియేటర్ ఘటన గురించి అందరికీ తెలిసిందే. పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, అల్లు అర్జున్పై నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన, ఈ విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత బన్నీ (Allu Arjun) ఏ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరు కాలేదు.
కానీ ఇప్పుడు నాగ చైతన్య (Naga Chaitanya)-సాయి పల్లవి (Sai Pallavi) జంటగా తెరకెక్కిన తండేల్ మూవీ ప్రీ-రిజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీన్ని బన్నీకి రీఎంట్రీ ఈవెంట్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో అభిమానులకు అనుమతి లేదని, కేవలం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకే ఎంట్రీ ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో బన్నీ అరెస్ట్‌పై నాగ చైతన్య ఏమన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చైతూ స్పందిస్తూ..
“ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి సమయంలో మనం ఒకరికొకరు అండగా ఉండాలి. అల్లు అర్జున్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో నాకు తెలుసు. కానీ ఇది జీవితం. మనం ముందుకెళ్లాల్సిందే”, అంటూ సమర్థించినట్లుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే నాగ చైతన్య సినిమా ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతుండడం ఓ ప్రత్యేకత.
ఈ ఈవెంట్‌లో బన్నీ తన అరెస్ట్ గురించి, తన అనుభవాలను పంచుకుంటారా? తండేల్ టీమ్‌కు సపోర్ట్‌గా మాత్రమే హాజరవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఈవెంట్‌లో నాగ చైతన్య కూడా బన్నీ గురించి ఏమైనా స్పెషల్‌గా చెబుతారా? అన్నది కూడా చూడాల్సిందే. తండేల్ (Thandel) మూవీ విషయానికొస్తే.. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై రూపొందింది.