నేను ఎన్ని మాటలైనా అంటా.. నన్ను మాత్రం ఎవరు ఏమన్నా ఊరుకోను. ఇలాంటోళ్లు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. దీంతో వాళ్లను చూస్తే ఓ రకం చిరాకు కచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇదే మాట అంటున్నారు చాలామంది అనసూయ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఒకటి చూసి. ఎందుకంటే ఎలాంటి బోల్డ్ విషయాల మీద నెటిజన్లు మాట్లాడుతున్నప్పుడు ఆమె హర్ట్ అయ్యి తిరిగి కోపమవుతుందో.. ఇప్పుడు అలాంటి టాపిక్ గురించి ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది.
అనసూయ (Anasuya) బికినీ వేస్తే సోషల్ మీడియాలో ఓ అలజడి రేగుతుంది. నెటిజన్లు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తుంటారు. కొన్ని కామెంట్లకు ఆమె రియాక్షన్ పాజిటివ్‌గా ఉంటే.. మరికొన్నింటికి ఆమె చాలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతుంది. అయితే ఆమె కామెంట్స్ ఆమెను ఆ ప్రశ్న అడిగేవారి బట్టి కూడా ఉంటుంది. తన బికినీల ఫొటోల గురించి, వాటి కింద వచ్చే కామెంట్ల గురించి యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సింహ ఆమెను ఓ ప్రశ్న వేశాడు.
అందులో ఆమె ఫొటోల కింద వచ్చే కామెంట్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. దానికి అనసూయ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా, లేదంటే విప్పుకుని తిరుగుతా. అది నా ఇష్టం అడగడానికి మీరెవరు అనేది ఆమె వాదన. అంతేకాదు తనని విమర్శించే వాళ్లను ఆంబోతులతో పోల్చింది అనసూయ. విమర్శించే వాళ్ల మీదకు ఆమె కోపం రావొచ్చు. అది సహజం.
అయితే కోపంలో ఏదో ఒకటి అనేస్తే.. రేపొద్దున వాళ్లు అనే మాటలకు ఆమె తిరిగి రియాక్ట్ అయ్యే అవకాశం ఉండదు. చూద్దాం ఇంకా ఇప్పుడు బయటికొచ్చిన వీడియో కేవలం ప్రోమోనే. అసలు వీడియో బయటకు వస్తే అందులో ఇంకెన్ని విషయాలు ఉంటాయో, ఆమె నుండి ఇంకెన్ని మాటలు వింటామో. అన్నట్లు ఆమె కుర్రాళ్లు, మధ్య వయస్కుల మహిళల గురించి, వారి మధ్య బంధాల గురించి కూడా కొన్ని మాటు చెప్పింది.