కొత్త ఏడాదిలో మొదటి నెల పూర్తయిపోతోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పాన్ ఇండియా సినిమాలతో ఈ నెల అదిరిపోయేది. కానీ కరోనా రాసిన స్క్రీన్‌ప్లేకి ఈ నెల దెబ్బడిపోయింది. ‘బంగార్రాజు’ తప్ప ఇంకో పెద్ద సినిమానే కనిపించలేదు ఈ నెలంతా. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల సమస్య ఒకటి. దీంతో బాక్సాఫీసు చాలా ఇబ్బందులు పడింది. అలా జనవరి… టాలీవుడ్‌కి ఫుల్ వర్రీ తెచ్చిపెట్టింది. ఈ నెలలో సుమారు 10 సినిమాలు విడుదలయ్యాయి.
వీటిలో ఒక్కటంటే ఒక్కటే హిట్. ఇదొక్కటి చాలు ఈ నెల టాలీవుడ్ బాక్సాఫీసు సంగతి చెప్పడానికి ఆ హిట్ సినిమానే నాగార్జున – నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘బంగార్రాజు’. సినిమా తొలుత మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా… ఆ తర్వాత సంక్రాంతి విన్నర్‌గా మారిపోయింది. ఇప్పుడు అదొక్కటే హిట్‌గా నిలిచింది. జనవరి తొలి వారంలో ‘ఆశ – ఎన్ కౌంటర్’, ‘ఇందువదన’, ‘1945’, ‘అతిథి దేవోభవ’ వచ్చాయి. అవన్నీ డిజాస్టర్‌గానే మిగిలిపోయాయి.
ఇక రెండో వారానికి వచ్చేసరికి అంటే సంక్రాంతి వారం. ఈ వారంలో ‘బంగార్రాజు’, ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’, సినిమాలు వచ్చాయి. ఇందులో ముందు చెప్పుకున్న ‘బంగార్రాజు’ మాత్రమే ఆకట్టుకుంది. మిగిలిన రెండు సినిమాలకు సరైన విజయం దక్కలేదు. అయితే హీరోలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కల్యాణ్‌దేవ్ ‘సూపర్ మచ్చి’ కూడా రెండో వారంలోనే వచ్చింది. కానీ వచ్చినట్లుగానే లేదు. అస్సలు ప్రభావం చూపించలేదు. మూడో వారంలో టాలీవుడ్‌లో కొత్త సినిమాలేవీ విడుదల కాలేదు. అంతకుముందు వారం వచ్చిన సినిమాలే థియేటర్స్‌లో ఉండిపోయాయి.
ఇక నాలుగో వారం కూడా సినిమాల సందడి కనిపించలేదు. నెలాఖరుకు వచ్చిన `గుడ్ లక్ సఖి` గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ ఓకే చేసిన సినిమా ఇది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. కానీ వచ్చాక నిరాశే మిగిల్చింది. గతేడాది ఆఖరులో వచ్చిన ‘పుష్ప’, ‘అఖండ’ కూడా సంక్రాంతి సీజన్‌లో మంచి వసూళ్లని రాబట్టాయి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!