సౌత్ సినిమాల దర్శకుడు బాలీవుడ్‌కి వెళ్లి బ్లాక్‌బస్టర్ కొట్టి.. ఆ పరిశ్రమకు తిరిగి విజయం రుచి చూపించారు అట్లీ. ఆయన ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ అడ్వెంచ్, సూపర్ హీరో స్టయిల్ సినిమా ‘రాకా’ తెరకెక్కిస్తున్న ఆ దర్శకుడు.. ఆ సినిమా అయిన వెంటనే ఆ సీక్వెల్ పనులు స్టార్ట్ చేసేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు బాలీవుడ్ – కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ సినిమానే ‘జవాన్’.
రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొంది రూ.1100 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఆ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ఓ వైపు కథ పనులు తన టీమ్ చేస్తోందట. ‘రాకా’ సినిమాకు ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఈ పనులు వేరే టీమ్ చూసుకుటోందట. ఆ పనులు ఎంతవరకు వచ్చాయంటే.. సినిమా మెయిన్ కాస్టింగ్‌ను ఇప్పుడు ఓకే చేసే పనిలో ఉన్నారట. హీరో షారుఖ్ ఖాన్ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చర్చ సినిమాలో మెయిన్ విలన్ గురించే. ఎందుకంటే ఆ పాత్రకు ఓ సౌత్ సినిమా స్టార్ హీరోను ఓకే చేసే పనిలో ఉన్నారట.
తొలి ‘జవాన్’కి చేసినట్లుగానే రెండో ‘జవాన్’కి కూడా సౌత్ స్టార్ హీరోనే అక్కడకు తీసుకెళ్లి విలన్‌ని చేద్దాం అనుకుంటున్నారట దర్శకుడు అట్లీ. ఆ హీరో ఈ సారి తెలుగు సినిమా నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే తొలి ‘జవాన్’లో విజయ్ సేతుపతి నటించాడు. ఆయన పాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. మరిప్పుడు అట్లీ విన్ ఎవరవుతారు అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సినిమా ప్రకటన ఉంటుంది అని కూడా చెబుతున్నారు.
‘రాకా’ సినిమాలో అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపిస్తాడు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరోవైపు వెర్సటైల్ పాత్రలు చేయాలని అల్లు అర్జున్ ఫిక్స్ అయి ఉన్నాడు. కాబట్టి ఏమన్నా జరగొచ్చు. అయితే తెలుగు స్టార్ హీరోలకు బాలీవుడ్ డైరెక్ట్‌గా కలసి రావడం లేదు. ‘జంజీర్’, ‘వార్ 2’ సినిమాలు మీరు చూసే ఉంటారు.
https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw