మినిస్టర్ గా జయరామ్!

మలయాళ స్టార్ నటుడు జయరామ్ తెలుగు తెరంగేట్రం చేస్తూ నటిస్తున్న చిత్రం “భాగమతి”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయరామ్ ఓ మినిస్టర్ పాత్ర పోషిస్తున్నాడట. మర్డర్ మిస్టరీ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో అనుష్క “భాగమతి”గా టైటిల్ పాత్ర పోషిస్తుండగా.. మలయాళ కథానాయకుడు ఉన్ని కృష్ణన్ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. తొలుత అనుష్క ఈ చిత్రంలో పోలీస్ పాత్ర పోషిస్తోందని కథనాలు వచ్చినప్పటికీ.. వాటిని చిత్ర దర్శకుడు అశోక్ తోసిపుచ్చాడు.

ఇకపోతే.. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుండగా.. అనుష్క అటు “బాహుబలి 2” మరియు “భాగమతి” చిత్రాల్లో గ్యాప్ లేకుండా కాల్షీట్స్ కేటాయించి మరీ క్యారెక్టర్లకు న్యాయం చేస్తోంది. తమిళ లేడీ కమెడియన్ విద్యురామన్ ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus