Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Jd Chakravarthy: కథలు కొట్టేయడం కామనే జెడి చక్రవర్తి కామెంట్స్ వైరల్!

Jd Chakravarthy: కథలు కొట్టేయడం కామనే జెడి చక్రవర్తి కామెంట్స్ వైరల్!

  • May 3, 2023 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jd Chakravarthy: కథలు కొట్టేయడం కామనే జెడి చక్రవర్తి కామెంట్స్ వైరల్!

నిర్మాత కనుక ఆ టైటిల్‌ని రిజిస్టర్ చేయించకపోతే.. కొట్టేసేవాడిని అని అన్నారు సీనియర్ నటుడు జెడీ చక్రవర్తి . ఇంతకీ ఆయన కొట్టేస్తానంటున్న టైటిల్ ఏమిటి ఆనుకుంటున్నారా? 1981లో సూపర్ కృష్ణ హీరోగా నటించిన ‘అంతం కాదిది ఆరంభం’ . ఇప్పుడీ టైటిల్‌తో క్రసెంట్ సినిమాస్, కృష్ణ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నూతన దర్శకుడు ఇషాన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్, సిరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ ‌పోస్టర్‌ ని జె.డి. చక్రవర్తి ఆవిష్కరించారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ..

‘‘టైటిల్ చూడగానే.. అరే ఇంత మంచి టైటిల్‌ని ఇప్పటి వరకు వదిలేశారేంటి? అని అనిపించింది. అందుకే ఈ చిత్ర నిర్మాత సిరాజ్‌ని టైటిల్ రిజిస్టర్ చేయించారా? అని అడిగాను. ఒకవేళ చేయించకపోతే నేను కొట్టేసేవాడిని. ఈ రోజుల్లో కథలు కొట్టేయడం కామన్.. ఇవాళ సరైన టైటిల్ దొరకడం లేదు. ‘అంతం కాదిది ఆరంభం’అనేది పాజిటివ్ అండ్ అద్భుతమైన టైటిల్. నా చిన్నప్పుడు ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ కృష్ణ గారు సినిమా చేశారు.

విజయనిర్మల‌ గారు ఆ సినిమాకి డైరెక్టర్. హైదరాబాద్ సుదర్శన్ 70MMలో రిలీజైంది. ఏంటీ.. గూగుల్‌లో సెర్చ్ చేసి చెబుతున్నానని అనుకుంటున్నారేమో.. కాదు.. నేనప్పుడు ఆ థియేటర్‌లో సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అయినా గూగుల్ సుదర్శన్ 70MM అని చెప్పదు కదా. అలా ఈ టైటిల్ నాకు బాగా గుర్తిండిపోయింది. ఇక ఈ టైటిల్‌తో సినిమా అంటే.. అన్నం అంతా చూడక్కరలేదు అనే సామెతలా.. ఈ టైటిల్ చూస్తుంటే ఇది మంచి సినిమా అని ఖచ్చితంగా నమ్మవచ్చు.

నమ్మకంగా థియేటర్స్‌కి వెళ్లి చూడవచ్చు.. న్యూ టీమ్ అంతా కలిసి చేస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని జె.డి చక్రవర్తి చెప్పుకొచ్చారు. టైటిల్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసిన (Jd Chakravarthy) జె.డి. చక్రవర్తికి చిత్ర దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తామని వారు ప్రకటించారు. ఇషాన్, ప్రణాళి, రాకెట్ రాఘవ, ప్రవీన్, కరాఠే కళ్యాణి, గీతాసింగ్, నాగమహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor JD Chakravarthy
  • #JD Chakravarthy
  • #producer

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

11 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

12 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

12 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

12 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

12 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

NTR : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీలో నటించటంపై క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల.. ఏమన్నాడంటే ?

23 mins ago
NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

18 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

19 hours ago
Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version