Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Reviews » Ponniyin Selvan 2 Review: పొన్నియన్ సెల్వన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ponniyin Selvan 2 Review: పొన్నియన్ సెల్వన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 28, 2023 / 03:59 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Ponniyin Selvan 2 Review: పొన్నియన్ సెల్వన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విక్రమ్, జయం రవి (Hero)
  • ఐశ్వర్యరాయ్, త్రిష (Heroine)
  • ప్రకాష్ రాజ్ (Cast)
  • మణిరత్నం (Director)
  • మణిరత్నం - సుభాస్కరన్ (Producer)
  • ఎ.ఆర్.రెహమాన్ (Music)
  • రవివర్మన్ (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 28, 2023
  • మద్రాస్ టాకీస్ - లైకా ప్రొడక్షన్స్ (Banner)

గత ఏడాది విడుదలై.. తమిళ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో, మిగతా భాషల ఆడియన్స్ ను మోస్తరుగా ఆకట్టుకున్న “పొన్నియన్ సెల్వన్” సెకండ్ పార్ట్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మణిరత్నం మ్యాజిక్ ఈసారైనా పూర్తిస్థాయిలో వర్కవుటయ్యిందో లేదో చూద్దాం..!!

కథ: పాండ్యుల దాడి అనంతరం సముద్రంలో మునిగిపోయిన పొన్నియన్ సెల్వన్ (జయం రవి) & వల్లవరాయన్ (కార్తీ)లను మందాకిని (ఐశ్వర్యరాయ్) కాపాడుతుంది.

నందిని (ఐశ్వర్యరాయ్) మరియు పాండ్యులు కలిపి చోళ రాజ్యాన్ని కూల్చి తమ జెండా ఎగురవేసేందుకు.. ఆదిత్య కరికాలుడ్ని (విక్రమ్) గద్దె దించడానికి పూనుకుంటారు.

అసలు మందానికి ఎవరు? ఈ ఉపద్రవాన్ని చోళులు ఎలా ఎదుర్కొన్నారు? అనేది “పొన్నియన్ సెల్వన్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: మొదటి భాగంలో కార్తీ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తో ఆకట్టుకోగా.. సెకండ్ పార్ట్ లో మాత్రం విక్రమ్ & ఐశ్వర్యరాయ్ అదరగొట్టారు. ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.

జయం రవి, త్రిష, ఐశ్వర్యలేక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, పార్తిబన్, రహమాన్ లు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు: తొలి భాగాన్ని పూర్తిగా పాత్రల పరిచయానికే కేటాయించిన మణిరత్నం.. రెండో భాగంలో అసలైన డ్రామాతో ఆకట్టుకున్నారు. నిజానికి మొదటి భాగం నచ్చనివాళ్లకి కూడా రెండో భాగం నచ్చుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. విక్రమ్ – ఐశ్వర్యరాయ్ ల నడుమ వైరాన్ని నిశ్శబ్ధంతో ఎలివేట్ చేసిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మాస్టర్ స్టోరీ టెల్లర్ అని మణిరత్నాన్ని ఎందుకు పొగుడుతారో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు అర్ధమైపోతుంది. తనదైన శైలి స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మణిరత్నం.

ఇక రవివర్మన్ సినిమాటోగ్రఫీ & ఫ్రేమ్స్.. మణిరత్నం పనితనాన్ని అద్భుతంగా ఎలివేట్ చేశాయి. రెహమాన్ సంగీతం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. ముఖ్యంగా నేపధ్య సంగీతం గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే.

ఆర్ట్ వర్క్ & వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

విశ్లేషణ: ముందు చెప్పినట్లుగా.. తొలి భాగం నచ్చనివాళ్ళు కూడా మెచ్చే చిత్రం “పొన్నియన్ సెల్వన్ 2”. మంచి డ్రామా, మణిరత్నం మార్క్ స్క్రీన్ ప్లే. రెహమాన్ సంగీతం, రవివర్మన్ ఫ్రేమ్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Click Here To Read in HINDI

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Lekshmi
  • #Aishwarya Rai
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam

Reviews

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

Nari Nari Naduma Murari First Review: శర్వానంద్ ఖాతాలో ‘సామజవరగమన’ లాంటి హిట్టు పడిందా?

4 hours ago
Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

Anaganaga Oka Raju Twitter Review: నవీన్ పోలిశెట్టి ఇంకో హిట్టు కొట్టేశాడా?

9 hours ago
Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

18 hours ago

latest news

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

18 hours ago
Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

Mana ShankaraVaraprasad Garu: 25 రోజులు రాత.. 75 రోజులు తీత

19 hours ago
The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

The RajaSaab: ‘ఖలేజా’ కి ఏం జరిగిందో ‘ది రాజాసాబ్’ కి కూడా అదే జరుగుతుంది : మారుతీ

20 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Mana ShankaraVaraprasad Garu Collections: అదిరిపోయిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ డే కలెక్షన్స్

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version