Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Agent Review In Telugu: ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Agent Review In Telugu: ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 28, 2023 / 11:52 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Agent Review In Telugu: ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అఖిల్ (Hero)
  • సాక్షి వైద్యా (Heroine)
  • మమ్ముట్టి , డినో మోరియా, మురళీ శర్మ , పోసాని కృష్ణమురళి (Cast)
  • సురేందర్ రెడ్డి (Director)
  • రామబ్రహ్మం సుంకర – అజయ్ సుంకర – పత్తి దీపా రెడ్డి (Producer)
  • హిప్ హాప్ తమిళ (Music)
  • రసూల్ ఎల్లోర్ (Cinematography)
  • Release Date : ఏప్రిల్‌ 28 , 2023
  • ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , సురేందర్ 2 సినిమా (Banner)

అఖిల్ అక్కినేని టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై ఎంటర్ టైనర్ “ఏజెంట్”. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. విడుదలైన టీజర్ & ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేశాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పుడు తన కళ్ళముందే తన స్నేహితులందరూ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవడంతో.. ఏజెంట్ కావాలని కలలుగంటూ.. అందుకు తగ్గట్లు ట్రైనింగ్ తీసుకుంటూ, రా ఏజెన్సీ చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి)ని ఇన్స్పిరేషన్ గా బ్రతుకుతుంటాడు రిక్కీ (అఖిల్ అక్కినేని).

ఎట్టకేలకు ఒక సీక్రెట్ మిషిన్ తో రంగంలోకి దిగుతాడు రిక్కీ. ఆ తర్వాత రిక్కీ ప్రయాణం ఎలా సాగింది? రిక్కీ తన సత్తాను చాటుకున్నాడా? అనేది “ఏజెంట్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: అఖిల్ ఈ సినిమా కోసం పడిన కష్టం ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. తన లుక్స్ & మ్యానరిజమ్స్ విషయంలో కొత్తదనం కోసం పరితపించిన అఖిల్, తన స్థాయికి మించి సినిమాలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. వైల్డ్ ఏజెంట్ గా అఖిల్ నటన, అతడి ఆహార్యం, ఫైట్స్ లో ఈజ్ & యాక్షన్ బ్లాక్స్ లో బిహేవియర్ ఆడియన్స్ ను అలరిస్తాయి.

మమ్ముట్టి మాత్రం ఆయన మార్క్ ను సినిమాలో చూపించలేకపోయారు. ఆయన పాత్రకి ఉన్న వెయిటేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు చిత్రబృందం.

సాక్షి వైద్య అందంగా కనిపించింది కానీ.. నటిగా మాత్రం ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. బాలీవుడ్ నటుడు డినో మోర్ మాత్రం తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ నేపధ్య సంగీతం సినిమాకి హై ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ను బ్యాగ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఎందుకో సరిగా చేయలేకపోయాడు. పాటల వరకూ పర్వాలేదనిపించుకున్నాడు.

రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. యాక్షన్ బ్లాక్స్ ను సరిగా కంపోజ్ & ఎలివేట్ చేయలేకపోయారు. నిజానికి ఈ తరహా స్పై థ్రిల్లర్స్ కు ఉండాల్సింది మంచి కెమెరా వర్క్. అదే ఈ సినిమాలో లోపించడం మైనస్ గా మారింది. వక్కంతం వంశీ అందించిన కథ కొత్తగా ఉన్నా.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఉన్న ఇమేజ్ కి.. స్పై థ్రిల్లర్ అనగానే ఆడియన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ అంచనాలను సురేందర్ రెడ్డి పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాడు. అఖిల్ క్యారెక్టర్ ఆర్క్ ను డీల్ చేసిన విధానం బాగుంది. అయితే.. మిగతా పాత్రలు మరియు స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడు.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకొనే చిత్రం “ఏజెంట్”. అఖిల్ కష్టం & క్యారెక్టర్ ఆర్క్ కోసం ఈ చిత్రాన్ని చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent movie
  • #akhil
  • #Dino Morea
  • #mammootty
  • #Sakshi Vaidya

Reviews

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Vrusshabha Review in Telugu: వృషభ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Champion Review in Telugu: ఛాంపియన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Mammootty: రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

trending news

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

30 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

41 mins ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

15 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

20 hours ago
Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

20 hours ago

latest news

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

53 seconds ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

12 mins ago
Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

28 mins ago
Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

1 hour ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version