Jeevitha: ఎనిమిదేళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టిన జీవిత!

సరికొత్త రాజశేఖర్‌ను ఆవిష్కరించడం పక్కా అంటూ… ఆ మధ్య ‘శేఖర్‌’ అనే సినిమా అనౌన్స్‌ అయ్యింది. నీలకంఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని తొలుత చెప్పారు. అయితే వివిధ కారణాల వల్ల నీలకంఠ తప్పుకున్నారు. అతని స్థానంలో లలిత్‌ అనే కొత్త దర్శకుడు వస్తారని చెప్పారు. ఆ విషయం చెబుతూ రాజశేఖర్‌ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ కూడా లాంచ్‌ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ దర్శకుడు మారారు. ఇటీవల వచ్చిన పోస్టర్‌లోనే ఆ మార్పు కనిపించింది. అంతేకాదు నిర్మాత కూడా మారారు.

ఏంటీ… పోస్టర్‌ చూశారా, చూసి వచ్చారా. అవును మీరు చూసింది నిజమే. ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తోంది జీవిత. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మెగాఫోన్‌ పట్టుకున్నారు. ఆఖరిసారిగా ‘మహంకాళి’ సినిమాకు 2013లో ఆమె దర్శకత్వం వహించారు. అందులో హీరో రాజశేఖర్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఎనిమిదేళ్లకు ఆమె మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. ‘శేఖర్‌’ సినిమాకు ఆమెనే దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో జీవిత – రాజశేఖర్‌.. డైరక్టర్‌ – హీరో కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయమే అందుకున్నాయి.

నిజానికి ‘శేఖర్‌’ నుండి నీలకంఠ తప్పుకున్నప్పుడే జీవిత పేరు దర్శకురాలిగా వినిపించింది. అయితే లలిత్‌ అనే కొత్త కుర్రాడు ఆ సినిమా చేస్తాడు అని చెప్పారు. కానీ ఏమైందో కానీ ఇప్పుడు జీవితనే మళ్లీ భర్తను డైరెక్ట్‌ చేసే పని పెట్టుకున్నారు. సినిమాను సంక్రాంతికి తీసుకొస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నారు. చూడాలి ఎప్పుడొస్తుందో, వచ్చాక ఎలా ఉంటుందో?

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus