Jeevitha Rajasekhar: కారు ప్రమాదం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న జీవిత!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జీవిత రాజశేఖర్ ఒకరు. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే హీరో రాజశేఖర్ ఇటీవల కూడా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజశేఖర్ నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇక వీరిద్దరి కుమార్తెలు కూడా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా రాజశేఖర్ జీవిత ఇద్దరు ఓ బుల్లితెర చానల్లో ప్రసారం అవుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. వీరిద్దరూ పండగ అంటే ఇట్టా ఉండాల అనే ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar)తమ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కొందరు స్టేజీ పై పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు.

ఇందులో భాగంగా ఇటీవల రాజశేఖర్ కారు ప్రమాద ఘటన గురించి కూడా వేదికపై పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన గురించి పర్ఫామెన్స్ చేయడంతో అక్కడే ఉన్నటువంటి జీవిత ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తమ బెంజ్ కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిందని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఈయన చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడ్డారని జీవిత ప్రమాదం గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. ఇలా కళ్ళముందే ప్రమాదం జరగడంతో ఆయన బతుకుతారో లేదో అని ఎంతో టెన్షన్ పడ్డట్లు చెప్పుకొచ్చింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus