నాని హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘జెర్సీ’. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా… ఆనిరుథ్ సంగీతమందించాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ కాలేక ‘ఏజ్ బార్’ అయిపోయిందని బాధపడే ఓ యువకుడి కథగా ఈ చిత్రం సాగుతుందని టీజర్ చూసిన ప్రతీఒక్కరూ ఫిక్సయిపోయారు. అంతేకాదు ఇది ప్రముఖ క్రికెటర్ రమణ్ లాంబా బయోపిక్ అని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని నాని క్లారిటీ ఇచ్చాడు.
.ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాని మాట్లాడుతూ.. ”అర్జున్ అనే ఓ క్రికెటర్ కథ ఇది. ఫిక్షన్ అనుకోవచ్చు. ఇది ఎవరి బయోపిక్ కాదు. అయితే అర్జున్ లాంటి కుర్రాడు నిజంగానే ఉన్నాడేమో అనిపిస్తుంది. క్రికెట్ అనేది ఈ చిత్రం కథలో ఓ చిన్న భాగం మాత్రమే. క్రికెట్ కంటే ఆసక్తికరమైన అంశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో.. మొదటి సిట్టింగ్ కే ఓకే చేసిన సినిమా ఇదే. క్లైమాక్స్ ప్రతీ ఒక్కరికీ కంటతడి పెట్టిస్తుంది” అంటూ నాని ‘జర్సీ’ చిత్రం పై క్లారిటీ ఇచ్చాడు. అయితే క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది.. అని చెప్పడం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం కూడా గమనించవచ్చు. ఈ చిత్రం క్లైమాక్స్ లో నాని ‘క్రికెట్ బాల్’ తలకి తగిలి మరణిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాని ఇలా చెప్పడంతో అది నిజమేనెమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!