ఎప్పుడో యాక్ట్ చేశాను.. ఇప్పుడు రిలీజ్ అవుతోంది: శ్రద్ధ శ్రీనాథ్
- August 17, 2019 / 12:17 PM ISTByFilmy Focus
“యు టర్న్” కన్నడ వెర్షన్ తో కథానాయికగా వెండితెరకు పరిచయమైన శ్రద్ధశ్రీనాథ్ తొలి సినిమాతోనే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకొన్న విధానం అప్పటికి అందార్నీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ లా మారిపోకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ.. తన ఉనికిని ఘనంగా చాటుకొంది. ఇక “జెర్సీ”తో తెలుగు డెబ్యూ చేసిన శ్రద్ధశ్రీనాథ్ తన నట ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా కట్టిపడేసింది.

అయితే.. అందరూ అనుకొంటున్నట్లు “జెర్సీ” శ్రద్ధశ్రీనాథ్ తెలుగు డెబ్యు సినిమా కాదు. ఆమె దానికంటే ముందు సైన్ చేసిన సినిమా “జోడీ”. ఆది కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కారణాంతరాల వలన ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది. మరి శ్రద్ధశ్రీనాథ్ ను అంతగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటో తెలియాలంటే జోడీ విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













