జోగి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. గతంలో జెమిని టీవీ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాంలో వీరిద్దరూ సందడి చేసేవారు. వీరిలో ఒకరైన జోగి నాయుడు డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో కనిపిస్తుంటాడు. ఈయన ప్రముఖ యాంకర్ ఝాన్సీని వివాహం చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ ఎందుకు విదిపోయారనే విషయం పై చాలా వార్తలు వచ్చాయి. ఝాన్సీ కెరీర్లో దూసుకుపోతుంటే.. జోగినాయుడు మాత్రం అవకాశాలు లేక.. నిరుత్సాహానికి గురవ్వడమే కాకుండా ఝాన్సీని వేధించడం మొదలుపెట్టాడని ప్రచారం జరిగింది.
అంతేకాదు ఝాన్సీకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాలపై జోగినాయుడు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. “నేను ఝాన్సీని వేధించానని వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఝాన్సీని పెళ్ళి చేసుకున్న తరువాత ఎనిమిదేళ్ళ పాటు సాఫీగా జీవితం సాగించాము. డబ్బు పరంగా, కెరీర్ పరంగా ఇతరులతో పోల్చుకోవడం వలనే జీవితాలు నాశనమవుతాయి. అలాంటి విషయాల కారణంగానే మా మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. ఝాన్సీ తన నుండీ విడిపోవడానికి ఆర్ధిక పరమైన విషయాలు కూడా కారణం. ఆమె తిరిగి వస్తుందని ఎంతోకాలం ఎదురుచూసి.. చూసి ఆ తరువాతే మరో వివాహం చేసుకున్నాను” అంటూ జోగినాయుడు చెప్పుకొచ్చాడు.