కోలీవుడ్ సెలబ్రిటీ స్టైలిస్ట్ జాయ్ క్రిసిల్డా (Joy Crizildaa), నటుడు-చెఫ్ మదంపట్టి రంగరాజ్ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నెల క్రితం ఆరు నెలల గర్భవతిగా ఉన్న జాయ్ క్రిసిల్డాను రంగరాజ్ పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించింది, ఆ సెన్సేషన్ మరచిపోక ముందే ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జాయ్ ఏకంగా రంగరాజ్ పైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గర్భవతిని చేశాక పెళ్లి చేసుకున్నాడని, కానీ ఇప్పుడు తనను పట్టించుకోకుండా మోసం చేస్తున్నాడని చెన్నై పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసింది.
రంగరాజ్‌కు అప్పటికే శ్రుతి అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన జాయ్ క్రిసిల్డాను పెళ్లి చేసుకున్నా, అతను తన మొదటి భార్యతోనే ఉంటున్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా మొదటి భార్యతో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లాడట, ఈ వ్యవహారమై ప్రశ్నిస్తే రంగరాజ్ తనపై దాడి చేశాడని జాయ్ తన ఫిర్యాదులో పేర్కొంది. విజయ్, విశాల్ వంటి స్టార్లకు స్టైలిస్ట్‌గా పనిచేసిన జాయ్‌కి కూడా ఇది రెండో వివాహమే.
విచిత్రం ఏంటంటే, కేసు పెట్టడానికి పది రోజుల ముందు కూడా జాయ్.. రంగరాజ్‌తో రొమాంటిక్ రీల్స్ పోస్ట్ చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలపై రంగరాజ్ మాత్రం మౌనంగా ఉంటూ, తన టీవీ షో అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుండటం గమనార్హం. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పోలీస్ కంప్లైంట్, సోషల్ మీడియా డ్రామాతో ఈ వివాదం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.