NTR30: తారక్30 మూవీ షూటింగ్ ను అలా ప్లాన్ చేశారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్నేళ్ల క్రితం వరకు ఏడాదికి కచ్చితంగా ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం 2023లో తన సినిమా ఏదీ రిలీజ్ కాదని అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. తారక్ కొరటాల శివ కాంబో మూవీ ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదలయ్యే ఛాన్స్ ఉందని మొదట ప్రచారం జరిగినా వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా వాయిదా పడింది.

అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన జాన్వీ కపూర్ నటిస్తుండగా తారక్ జాన్వీ జోడీ బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని జాన్వీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీదేవి స్థాయిలో జాన్వీ కపూర్ సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జాన్వీ కపూర్ మంచి కంటెంట్ తో తెరకెక్కిన కథలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ధైర్యం ఒక వ్యాధిగా మారినప్పుడు భయమే విరుగుడు అవుతుందనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2024లో థియేటర్లలో విడుదలై ఏ స్థాయిలో సంచలనాలను సృష్టించబోతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా నటుడిగా తారక్ స్థాయిని మరో లెవెల్ కు పెంచుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో త్వరలో క్లారిటీ రానుంది. తారక్ సినిమాలన్నీ 200 నుంచి 300 కోట్ల రూపాయల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. తారక్ తర్వాత సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus