యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎదురుచూస్తోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పరిగణలో ఉన్నట్లు టాక్.
భారీ యాక్షన్ ఎలిమెంట్లతో పాటు విశేషంగా క్యారెక్టర్ బిల్డప్ ఉంటుందని ప్రశాంత్ నీల్ సూచనలు ఇచ్చారు. సాధారణంగా ఆయన చిత్రాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు, కానీ ఈ ప్రాజెక్ట్‌ను 10 నెలల కాలంలోనే పూర్తి చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 సంక్రాంతి విడుదల టార్గెట్‌తో ముందుకెళ్తున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా ఆ డేట్‌ను అందుకుంటుందా అనే సందేహం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌ను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆ ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఈ పాన్ ఇండియా సినిమాలోకి ప్రవేశించనున్నారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ ఎలాంటి జాప్యానికి తావు ఇవ్వకుండా పూర్తి ఫోకస్ పెట్టేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ తన క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన షూటింగ్ షెడ్యూల్‌ను ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు టాక్. అయితే ఆమె పాత్ర నిడివి పరిమితంగా ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రుక్మిణి (Rukmini Vasanth) పాత్రను ప్రశాంత్ నీల్ తన గత చిత్రాల్లో శృతి హాసన్ పాత్ర తరహాలో డిజైన్ చేసినట్లు సమాచారం. ఆమె పాత్రకు ప్రత్యేకతను జోడించేందుకు కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ సమయంలో ఏ చిన్న జాప్యం జరిగినా, 2026 సంక్రాంతి విడుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినా, మేకర్స్ తమ టార్గెట్‌కి చేరుకోవడం కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ టార్గెట్ నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.