చాలామంది వ్యాపారులు, వెబ్‌సైట్లు ఎన్టీఆర్ (Jr NTR) అనుమతి లేకుండా ఆయన పేరును, ఫోటోలను, గొంతును (వాయిస్), చివరకు ఆయన సంతకాన్ని కూడా వాడుకుని టీ-షర్టులు, ఇతర వస్తువులు అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి సాయంతో డీప్‌ఫేక్ వీడియోలు చేస్తున్నారు.ఆయన గొంతును కూడా అసభ్యకర పదజాలం కోసం వాడుతున్న సంగతి తెలిసిందే. వీటి వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని, తన పర్మిషన్ లేకుండా తన ఐడెంటిటీని వాడకూడదని తారక్ కొద్ది నెలల క్రితం కోర్టుకెక్కారు.
ఢిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జి అయిన జస్టిస్ జ్యోతి సింగ్ ఈ కేసును విచారిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఎన్టీఆర్ స్టైల్ లేదా డైలాగ్ డెలివరీ వంటి వాటిని ఎవరైనా వాణిజ్యపరంగా (డబ్బులు సంపాదించుకోవడానికి) వాడుకోవాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ అనుమతి తప్పనిసరి అని ఆదేశించింది. దీనినే ‘పర్సనాలిటీ రైట్స్’ అని ప్రస్తావిస్తారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్ వంటి వారు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి పర్సనాలిటీ రైట్స్ అనుమతులు తెచ్చుకున్నారు. అవి ఉంటే.. డిఫెమేషన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా దానికోసమే న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఆయన కేసు పై విచారణ జరగనుంది. ఫైనల్ జడ్జిమెంట్ వంటివి ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజిగా గడుపుతున్నాడు. అలాగే దేవర 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. మరోవైపు నెల్సన్ , త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో కూడా ఎన్టీఆర్ సినిమాలు చేయాల్సి ఉంది.