Jr NTR: వైరల్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న తారక్ దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశారు. ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమాకు ఏకంగా 405 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.

Jr NTR

వేర్వేరు కారణాల వల్ల దేవర సక్సెస్ మీట్ జరగకపోయినా దేవర టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంది. తారక్ మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల ఔట్ డోర్ లో దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ కు అనుమతులు రాలేదని తెలిపారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్, దేవర సక్సెస్ వెనుక డైరెక్టర్స్ తో పాటు టెక్నీషియన్స్ తో పాటు అభిమానులు ఉన్నారని తారక్ పేర్కొన్నారు.

అభిమానులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తారక్ తెలిపారు. ఈ జన్మలో ఫ్యాన్స్ కోసం ఏం చేసినా అది వడ్డీ మాత్రమేనని మరు జన్మలో మీ రుణం తీర్చుకుంటానని తారక్ వెల్లడించారు. దేవర సినిమా కోసం పని చేసిన అందరికీ తారక్ థ్యాంక్స్ చెప్పారు. తారక్ చేసిన కామెంట్లు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దేవర సినిమా బీజీఎం విషయంలో అనిరుధ్ ను తారక్ మెచ్చుకున్నారు.

నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉంటూ కళ్యాణ్ రామ్ ఆశీర్వచనాలు అందిస్తున్నారని తారక్ తెలిపారు. బృందావనం నుంచి కొరటాల శివతో బంధం మొదలైందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. కొరటాల శివ సోదరుడిగా చాలా సందర్బాల్లో నిలబడ్డాడని తారక్ తెలిపారు. కొరటాల శివ దేవర సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించడం గమనార్హం.

తొలి మూడు రోజుల్లో 300 కోట్లు.. తర్వాత మూడు రోజుల్లో అంత తక్కువా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus