Devara: తొలి మూడు రోజుల్లో 300 కోట్లు.. తర్వాత మూడు రోజుల్లో అంత తక్కువా?

‘దేవర’ (Devara) సినిమాకు వచ్చిన టాక్‌.. టీమ్‌ చెబుతున్న వసూళ్ల విషయంలో ఎక్కడో తేడా కొడుతోంది.. అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో కామెంట్లు, పోస్టులు కనిపిస్తూనే ఉన్నాయి. చెప్పినంత వస్తోందా? అంటూ ఆధారాలు ఇవే అంటూ కొన్ని లెక్కలు కూడా వేస్తున్నారు. వాటి విషయంలో క్లారిటీ రావడం అంత ఈజీ కాదు కానీ.. నాలుగో రోజు నుండి సినిమా టీమ్‌ చెబుతున్న వసూళ్ల లెక్క వింటుంటే.. మొదటి మూడు రోజుల లెక్క కరెక్టేనా అని అనిపించకమానదు.

Devara

కావాలంటే మీరే చూడండి. సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా వసూళ్లు సెప్టెంబరు 29 నాటికి రూ. 300 కోట్లు దాటిపోయాయి అని టీమ్‌ చెప్పింది. ఈ మేరకు పోస్టర్లు కూడా రిలీజ్‌ చేసింది. బాక్సాఫీసు దగ్గర ‘దేవర’ తాండవం అని కూడా అన్నారు. కానీ సెప్టెంబరు 30 నుండి చూస్తే వసూళ్లు ఆ స్థాయిలో కాదు కదా.. అందులో సగం కూడా లేవు. అందుకే ఆరు రోజులు పూర్తయ్యేసరికి సినిమా వసూళ్లు రూ. 400 కోట్లు దగ్గరకు వచ్చాయి.

దీని బట్టి వసూళ్లు ఏ స్థాయిలో డ్రాప్ అయ్యాయో అర్థం అవుతుంది. వీక్ డేస్ కదా అందుకే తగ్గాయి అని అనొచ్చు.. కానీ తారక్‌ లాంటి మాస్‌ హీరో సినిమాకు వీక్‌డేస్‌, వీకెండ్స్‌ ఉంటాయా అనే మాట మనం మరచిపోకూడదు. ఒకవేళ వీకెండ్స్‌ + దసరా సెలవుల్లో సినిమా తిరిగి పుంజుకుంటే రూ. 600 కోట్ల మార్కు దగ్గర ఫుల్‌ రన్‌ ఆగిపోతుంది. లేదంటే రూ. 500 కోట్ల దగ్గర ఆగుతుంది అని లెక్కలేస్తున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

మరోవైపు సినిమాకు బుక్‌ మై షోలో రేటింగ్ పరిస్థితీ అలానే ఉంది. తమిళ డబ్బింగ్‌ సినిమా ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  కంటే ఆరు పాయింట్లు తక్కువ కనిపిస్తోంది. ఆ లెక్కన ఫలితం అంచనా వేయొచ్చు. బుక్‌ మై షో రేటింగ్‌ నిజమా? అని అంటే.. రేటింగ్‌ బాగున్నప్పుడు సినిమా టీమ్‌లు అవి చూపించే ప్రచారం చేసుకుంటున్నాయి కదా. కాబట్టి నమ్మొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus