Jr NTR, Chiranjeevi: చిరు పై ఎన్టీఆర్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్స్ రీత్యా జపాన్ లో ఉన్నాడు. అక్కడ తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను జపాన్ లోకి ఎంట్రీ ఇవ్వడమే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు.ఇక అక్కడ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ జపాన్ లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు.ఇదే క్రమంలో అతను మెగాస్టార్ చిరంజీవి గొప్పతన్నాని వివరించి మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ..‘‘చరణ్ తండ్రి తెలుగు చిత్ర సీమలో గ్రేటెస్ట్ డాన్సర్. అలాగే మాకు బెస్ట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. ప్రభుదేవాను ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుస్తాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ చిరంజీవి పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా చరణ్ తండ్రి గ్రేటెస్ట్ డాన్సర్ అని ఎన్టీఆర్ చెప్పడం పట్ల ఎన్టీఆర్ ను పొగుడుతూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించగా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించాడు.

ఇద్దరూ ఈ పాత్రలకు జీవం పోశారని చెప్పాలి. సెకండ్ హాఫ్ ల్లో కొమరం భీముడొ పాటకి ఎన్టీఆర్ పలికించిన హావభావాలు ఇంకో పది తరాల వరకు ఏ హీరో పలికించలేడు అనే విధంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో అల్లూరి సీతారామరాజు పాత్రని రాముడితో పోల్చి రాజమౌళి ఎలివేట్ చేయడం, దానికి చరణ్ నిజంగానే మన్యం వీరుడిగా కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.

మార్చి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఈ మూవీ రూ.1135 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమాల్లో 2022 కి గాను హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘కె.జి.ఎఫ్ 2’ తర్వాతి స్థానంలో నిలిచింది. జపాన్ లో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తే చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus