Jr NTR: ఆరోజు ఎన్టీఆర్ తీపికబురు చెబుతారా..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిగతా స్టార్ హీరోలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో గాసిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 31వ సినిమా డైరెక్టర్స్ రేసులో ప్రశాంత్ నీల్, అట్లీ, బుచ్చిబాబు సానా ఉన్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో ముందు నటిస్తారో తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను తెరకెక్కిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఉప్పెన సినిమాతో సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారని కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా పట్టాలెక్కనుందని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. మరి ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో చూడాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus