Jr NTR: అభిమాని తల్లి ఆవేదన.. ఎన్టీఆర్ వీడియో కాల్ చేశాడు కానీ..?!

తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  అభిమాని కౌశిక్ .. క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘దేవర’ (Devara)  సినిమా చూడాలన్నది అతని చివరి కోరిక అంటూ గతంలో అతను చేసిన ఎమోషనల్ కామెంట్స్.. జూ.ఎన్టీఆర్ వరకు వెళ్లాయి. దీంతో ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి అభిమానితో మాట్లాడటం జరిగింది. ‘ధైర్యం కోల్పోవద్దని.. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడని, అండగా తాను కూడా ఉన్నానని, ఎటువంటి సాయం కావాలన్నా నాకు చెప్పమని’ ఎన్టీఆర్ హామీ ఇవ్వడం జరిగింది.

Jr NTR

ఆ తర్వాత కౌశిక్‌ ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ అతని బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినట్టు సమాచారం. అయితే కీమో అనంతరం డబ్బు అవసరం పడటంతో ఎన్టీఆర్ టీంని ఆమె సంప్రదించగా.. వారు సరిగ్గా రెస్పాండ్ కావడం లేదు అంటూ కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. కౌశిక్ తల్లి సరస్వతి మాట్లాడుతూ.. “జూనియర్ ఎన్టీఆర్ నుండి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు.

వాళ్ళ అభిమానుల నుండి మాకు రూ.2.5 లక్షల వరకు సాయం అందింది. సి.ఎం.ఆర్.ఎఫ్ నుండి మాకు రూ.11 లక్షల సాయం అందింది. టిటిడి వాళ్ళు రూ.40 లక్షలు ఇచ్చారు. కీమో చేయడం వల్ల హార్ట్, లంగ్స్ వంటి వాటికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు. అందువల్ల డిశ్చార్జ్ చేస్తాం తీసుకెళ్లండి అంటున్నారు. కానీ రూ.20 లక్షలు కడితేనే డిశ్చార్జి చేస్తామని చెబుతున్నారు.

ఎన్టీఆర్ అయితే మాట ఇచ్చారు కానీ ఆయన నుండి ఎటువంటి సాయం అందలేదు. కృష్ణ యాదవ్ అనే వ్యక్తిని సాయం అడిగితే మీ ప్రభుత్వాన్ని ఆశ్రయించండి అన్నారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ కి కాల్ చేస్తే.. ‘మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు కదా’ అని అన్నారు” అంటూ చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది.

సైలెంట్ గా వచ్చి బాగానే కలెక్ట్ చేసింది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus