UI Collections: సైలెంట్ గా వచ్చి బాగానే కలెక్ట్ చేసింది!

కన్నడ స్టార్ ‘ఉపేంద్ర’  (Upendra Rao) సినిమాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. ‘A’ ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి సినిమాలతో ఓ ట్రెండ్ సెట్ చేశారు ఉపేంద్ర. ఇటీవల ‘UI ది మూవీ’ ( UI The Movie)  తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉపేంద్ర డైరెక్షన్లో రూపొందిన 10వ సినిమా ఇది. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ (Manoharan) & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ (Sreekanth K.P.) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత.

UI  Collections:

తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.27 cr
సీడెడ్ 0.07 cr
ఆంధ్ర(టోటల్) 0.30 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.64 cr

‘UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి. వీకెండ్ ముగిసేసరికి రూ.0.64 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేస్తే.. ఈ సినిమా యావరేజ్ రిజల్ట్ వరకు వెళ్లొచ్చు.

‘విడుదల 2’ మూడో రోజు కొంచెం బెటర్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus