Devara: దేవర పోస్ట్ పోన్ వార్తలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర మూవీ పోస్ట్ పోన్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. దేవర ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ విధ్వంసమేనని ఫ్యాన్స్ వైరల్ అవుతున్న వార్తల గురించి రియాక్ట్ అవుతున్నారు. దేవర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని వాళ్లు చెబుతున్నారు. దేవర సినిమా చెప్పిన తేదీ ప్రకారం విడుదల కావాల్సి ఉన్నా సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడంతో ఈ సినిమా రిలీజ్ మారిందని సమాచారం అందుతోంది.

దేవర సినిమా విజువల్ ఎఫెక్స్ట్ పనుల వల్ల కూడా వాయిదా పడుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర పోస్ట్ పోన్ గురించి మేకర్స్ త్వరగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. దేవర సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప2 రిలీజ్ డేట్ కు దేవర విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా పాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్లకు రిలీజ్ కాకపోవడం వల్ల ఇతర సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నారు.

తారక్, చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ సైతం ఎన్నో రిలీజ్ డేట్లను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ దేవర సినిమాను ఏప్రిల్ 5నే విడుదల చేయాలని భావించినా ఊహించని సమస్యలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కు సెంటిమెంట్ పరంగా ఏప్రిల్ నెల కలిసిరాదని దేవర మరో నెలలో రిలీజ్ కావడమే మంచిదని ఫ్యాన్స్ చెబుతున్నారు..

దేవర (Devara) సినిమా పోస్ట్ పోన్ అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా ఆ ఎఫెక్ట్ కొంతమేర పడే ఛాన్స్ అయితే ఉంటుంది. తారక్ తన సినిమాల లైనప్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని మరి కొందరు చెబుతున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమా రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus