యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ మూవీ షూటింగ్ శేరవేగంగా, జరుగుతూ దూసుకుపోతుంది. చిత్ర యూనిట్ అనుకున్న దానికన్నా ముందుగానే ఈ సినిమాను ఫినిష్ చేసి అభిమానులకు విందును ఇవ్వాలని చూస్తున్నట్లు ఉంది ప్రస్తుత ఎన్టీఆర్ సినిమా పరిస్థితి. అయితే తాజాగా జరిగిన ఒక పరిణామం చూస్తే ఎన్టీఆర్ కు కాస్త బాధపడ్డాడంటా. ఇంతకీ ఏంటి ఆ పరిణామం అంటే…తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ‘జనతా గ్యారెజ్’ టీం రీలీజ్ చేసింది. ‘జనతా గ్యారెజ్’ ఫస్ట్ లుక్ పై అంతటా అంచనాలు పెరిగిపోవటంతో…ఈ మూవీకి సంబంధించని ఫస్ట్ టీజర్ పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ‘జనతా గ్యారెజ్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ని మే 28న రిలీజ్ చేయాలని చూశారు.
కానీ చివరి నిముషంలో టీజర్‌ను విడుదల చేయట్లేదని చిత్రయూనిట్ తెలిపింది. ఇందుకు కారణాలుగా పోస్ట్ ప్రొడక్షన్ సరిగా కాకపోవటం వంటివి జూనియర్ కి కనిపించాయి. దీంతో ‘జనతా గ్యారెజ్’ మూవీ ఫస్ట్ టీజర్ ని అభిమానులకి ప్రామిస్ చేసినట్టుగా అనుకున్న టైంకి రిలీజ్ చేయలేకపోవటం వల్ల జూనియర్ డిస్సప్పాయింట్ అయ్యాడని అంటున్నారు. అసలే ఎన్టీఆర్ కు అభిమానులంటే ప్రాణం, అలాంటి అభియానుల్ని నిరాశ పరిచానని కాస్త ఫీల్ అయ్యాడంటా మన యంగ్ టైగర్..