Jr NTR: మరొ క్రేజీ ప్రాజెక్ట్ కు తారక్ ఓకే చెప్పారా?

  • November 5, 2022 / 12:25 AM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కచ్చితంగా సక్సెస్ అయ్యే ప్రాజెక్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. తారక్ తర్వాత సినిమాలు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉండటంతో పాటు ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పారని తెలుస్తోంది.

క్లాస్ సినిమాల దర్శకునిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తారక్ తో ఎలాంటి ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తారో చూడాలి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పైనే ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సీతారామం డైరెక్టర్ తో తారక్ సినిమా అంటే ఆకాశమే హద్దుగా ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు. సీతారామం సినిమా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

జరుగుతున్న ప్రచారం గురించి హను రాఘవపూడి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఈ ప్రచారం గురించి స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ కొరటాల కాంబో మూవీ రెగ్యులర్ షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చే ఎన్నో అంశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. హను రాఘవపూడి సినీ కెరీర్ లో సక్సెస్ రేట్ తక్కువేననే సంగతి తెలిసిందే.

వైజయంతీ మూవీస్ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తారక్ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయితే ఈ బ్యానర్ లోనే తారక్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని తారక్ ఫాలో అవుతున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus