Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ పై షాకింగ్ అప్ డేట్.. ఏం జరిగిందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఆ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. వార్2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. ధూమ్ సినిమాలోని ఒక పాత్ర తరహాలో జూనియర్ ఎన్టీఆర్ రోల్ ను క్రియేట్ చేశారని ఈ రోల్ మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) రోల్ కు సంబంధించి వస్తున్న అప్ డేట్లు తారక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న తారక్ వార్2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న తారక్ ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

వార్2 సినిమాలో తారక్ ఎప్పటినుంచి షూటింగ్ లో పాల్గొంటారో క్లారిటీ రావాల్సి ఉంది. వార్2 సినిమాకు తారక్ పరిమితంగానే డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. వార్2 సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుండగా ఈ సినిమా అన్ని భాషల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బ్రహ్మాస్త్ర సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న అయాన్ ముఖర్జీ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. భాషతో సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భవిష్యత్తు సినిమాలు తారక్ కు భారీ విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus