‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ గౌరవం దక్కేటప్పుడు ఎక్కడో తారక్‌ను తక్కువగా చూశారు అనే చిన్న వెలితి అభిమానుల్లో ఉంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ దృష్టికి తీసుకొచ్చారు కూడా. అయితే ఇప్పుడు అభిమానుల వెలితిని తీరిపోయింది. అంతేకాదు అంతకుమించిన ఆనందం కూడా వారికి దక్కింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ యాక్టర్స్ లిస్ట్‌లో తారక్‌కు స్థానం కల్పించినట్లు అకాడెమీ అవార్డ్స్ ప్రకటించింది. దీంతో ఆ పోస్ట్, అభిమానుల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆస్కార్ ‘యాక్టర్స్ బ్రాంచ్’ లిస్ట్‌లో తారక్‌కు సభ్యత్వం ఇచ్చినట్లు ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్’ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన తారక్ ఈ లిస్ట్‌తో ఇంకొక స్టెప్ పైకి ఎక్కాడు అని చెప్పొచ్చు. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ కోసం అకాడమీ ప్రపంచవ్యాప్తంగా అగ్ర నటులను స్వాగతించింది. అందులో ఒకరు ఎన్టీఆర్.
ఆస్కార్స్ ప్రకటించిన కొత్త జాబితాలో ఎన్టీఆర్‌తోపాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ లాంటి అగ్ర నటులు కూడా స్థానం సంపాదించారు. ఆ జాబితాలో ఎన్టీఆర్ పేరు చూశాక దసరా ముందు అభిమానులకు భలే కబురు వచ్చింది అంటూ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు ఆస్కార్స్ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు. మరి ఈ విషయంతో తారక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తారక్ (Jr NTR) సాధించిన ఈ ఫీట్ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు, మొత్తంగా ఇండియన్ సినిమాకే గర్వకారణమని పొగిడేస్తున్నారు. అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వానికి ఆహ్వానం కోసం అభ్యర్థి తప్పనిసరిగా కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ సినిమాల్లో నటించి ఉండాలి. వాటిలో ఒకటి గత ఐదు సంవత్సరాలల్లో విడుదలై ఉండాలి. అది అకాడమీ ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించే సత్తా కలిగి ఉండాలి. అలానే ఏదొక క్యాటగిరీలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయి ఉండాలి. ‘ఆర్‌ఆర్ఆర్’తో ఈ ఘనత సాధించి జాబితాలో చోటు సంపాదించాడు తారక్.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!