Jr NTR: మార్చి 26వ తేదీ సీక్రెట్ చెప్పేసిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. రోజులు గడిచే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల విషయంలో వేగం పెంచి తారక్, చరణ్, రాజమౌళి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తారక్, చరణ్ కెరీర్ లో ఈ సినిమా మెమొరబుల్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Click Here To Watch Now

ఇంటర్వ్యూలలో చరణ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలను వెల్లడిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ చరణ్ మధ్య స్నేహం ఎప్పటినుంచి మొదలైందని ప్రేక్షకుల్లో చాలామందికి సందేహం ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ వల్ల ఆ ప్రశ్నకు కూడా సులభంగానే సమాధానం దొరికింది. ఇద్దరి మధ్య స్నేహం గురించి తారక్ మాట్లాడుతూ తాను, చరణ్ భిన్న ధ్రువాలమని చెప్పారు. సాధారణంగా భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయని తమ ఇద్దరి విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు.

చరణ్ అగ్ని పర్వతం బద్ధలవుతున్నా కామ్ గా ఉంటారని స్టార్ క్రికెట్ పోటీలు జరిగిన సమయంలో తమ మధ్య స్నేహం ఏర్పడిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. మార్చి 26వ తేదీ తన భార్య ప్రణతి పుట్టినరోజని మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు అని ఎన్టీఆర్ వెల్లడించారు. మార్చి 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటిముందు చరణ్ కారు ఆగుతుందని తాను, చరణ్ కారులో వెళ్లిపోతామని ప్రణతి కాల్ చేసి ఎక్కడున్నారని అడిగితే చరణ్ తో ఉన్నానని చెబుతానని

ఈరోజు నా పుట్టినరోజు కదా అని ప్రణతి అడిగితే నీ పుట్టినరోజు నిన్ననే అయిపోయింది కదా అని చెబుతానని తారక్ పేర్కొన్నారు. రామ్ చరణ్ గేట్ దగ్గర ప్రణతి ఉందేమో అని భయపడతాడని తారక్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా గత కొన్నేళ్లుగా చరణ్ పుట్టినరోజుకు హాజరవుతున్నానని తారక్ వెల్లడించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus