Jr NTR, Koratala Siva: అప్పటివరకు తారక్ ఫ్యాన్స్ కు ఎదురుచూపులు తప్పవా?

తారక్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా నవంబర్ రెండో వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. ఆ సమయంలోనే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. డిసెంబర్ నెల రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది.

తారక్ తర్వాత సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను వేగంగానే పూర్తి చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పూజా కార్యక్రమాలు జరిగిన రోజునే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. తారక్ ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినిమా స్క్రిప్ట్ ను కొరటాల శివ సిద్ధం చేశారని బోగట్టా.

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొరటాల శివ ఏకంగా ఆరు నెలల సమయం కేటాయించారు. కొరటాల శివ ఈ సినిమా రిజల్ట్ విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ల జాబితాలో చేరాలని కొరటాల శివ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఈ సినిమాతో కచ్చితంగా బ్రేక్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఆలస్యమవుతున్నా ఆ ఎదురుచూపులకు తగ్గ రిజల్ట్ కచ్చితంగా దక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus