Jr NTR, Koratala Siva: తారక్ మూవీకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారా?

తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్30 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుండగా ఈ సినిమాకు ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. టైటిల్ కొత్తగా ఉండాలనే ఆలోచనతో మేకర్స్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. అయితే చిత్రయూనిట్ నుంచి క్లారిటీ వస్తే సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందో లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందో తెలిసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

మరోవైపు తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నటిస్తారో సౌత్ హీరోయిన్ నటిస్తారో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. పాన్ ఇండియా నటులకు ఈ సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండగా సినిమా రిలీజ్ సమయానికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత కొరటాల శివపై ఉంది.

తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా కొరటాల శివ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆచార్య సినిమా ద్వారా తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొరటాల శివ గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆచార్య సినిమా సమయంలోనే కొరటాల శివ సోషల్ మీడియాకు కూడా దూరమైన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమా విడుదలైన తర్వాతే కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్30 నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా కొరటాల శివ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus