Jr NTR, Koratala Siva: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రతినాయకుడు అతనేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి అప్ డేట్స్ లేకపోయినా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపించగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని మరో హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
అయితే ఈ సినిమాలో తారక్ కు విలన్ గా బాలీవుడ్ హీరోను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

తారక్ కు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తారని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం తారక్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ కొరటాల శివ కాంబో మూవీలో విలన్ రోల్ చాలా స్పెషల్ గా ఉంటుందని బోగట్టా.

300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఖర్చుకు సంబంధించి ఏ మాత్రం రాజీ పడవద్దని నిర్మాతలు కొరటాల శివకు సూచించారని సమాచారం. ఆచార్య చేదు జ్ఞాపకాలను మరిపించేలా కొరటాల శివ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏకంగా ఐదు భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం తారక్ వెకేషన్ లో ఉండగా తారక్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్ రానుందని సమాచారం. తారక్ కొరటాల కాంబోలో ఈ మూవీ స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus