NTR, Koratala Siva: ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ షురూ..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆడియన్స్ లో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అతని నటన అద్భుతంగా ఉంటాయి. ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో వీక్షకులను మెప్పించాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో నటించాల్సి ఉంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావటంతో ఎన్టీఆర్ తన సినిమా గురించి చాలా ఆందోళన పడుతున్నాడు. అందువల్ల మరొకసారి సినిమా స్టోరీ క్షుణ్ణంగా తెలుసుకొని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అయినా కూడా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ మొదలు కాకపోవటంతో ఆయన అభిమానులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి అన్నట్లు అసహనంగా ఉన్నారు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆచార్య సినిమా దెబ్బ కొట్టడంతో కొరటాల శివ కూడా ఈ సినిమా స్టోరీలో చాలా మార్పులు చేశాడని, తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఆగస్టు 30 వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయములో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus