Jr NTR, Koratala Siva: కొరటాల సినిమా ఇంకా చాలా చాలా లేట్‌!

కొరటాల శివ – ఎన్టీఆర్‌ సినిమా.. దీని గురించి ఎదురు చూస్తున్నవాళ్లకు మరో షాక్‌. ఛస్‌ ఊరుకోండి.. ప్రతి నెలా ఏదో పేరు పెట్టి షాక్‌లు ఇస్తూనే ఉన్నారుగా. మళ్లీ కొత్తగా షాక్‌ ఏంటి అనుకుంటున్నారా? అలా అయితే షాక్‌ కాదు కానీ.. కొత్త సమాచారం. ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఈ నెలలో స్టార్ట్‌ అయ్యే అవకాశం లేదంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా వచ్చే సంక్రాంతి తర్వాతే ఉంటుంది అంటున్నారు. దీనిపై క్లారిటీ అయితే లేదు కానీ.. సినిమా ఈ నెలలో ప్రారంభం కాదు అనే విషయంలో మాత్రం క్లారిటీ ఉంది.

దీనికి కారణం ఓవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతుండటంతో అయితే.. మరో కారణం ఎన్టీఆర్‌ విదేశీ పర్యటన అని చెబుతున్నారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలసి ఎన్టీఆర్‌ కుటుంబం ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి తనయులు మంచి స్టయిలిష్‌గా నడిచి వెళుతున్న ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అలాగే సినిమా ఇప్పట్లో మొదలుకాదు అనే సమాచారమూ ఇచ్చాయి.

ఎన్టీఆర్‌ సన్నిహితుల సమాచారం ప్రకారం అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ తాజా అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని సమాచారం. కొత్త ఏడాదికి ఎన్టీఆర్‌ అక్కడే వెల్‌కమ్ చెప్పనున్నారట. తొలుత క్రిస్‌మస్‌ వేడుకల్లో పాల్గొని, ఆ తర్వాత కొత్త సంవత్సరం సందడి పూర్తి చేసి.. ఆ తర్వాత కొంతమంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తోపాటు అభిమానులను ఎన్టీఆర్ కలిసి అవకాశం ఉందట. అలా సంక్రాంతికి ఒకట్రెండు రోజుల ముందు ఎన్టీఆర్‌ స్వదేశంలో ల్యాండ్‌ అవుతారట.

ఈలోపు కొరటాల శివ సినిమాకు సంబంధించి పనులన్నీ పూర్తి చేస్తారట. మ్యూజిక్‌ సెట్టింగ్స్‌, లొకేషన్ల వెతుకులాట లాంటివి ఈ లోపు అయిపోతాయట. అలా ఎన్టీఆర్‌ రాగానే సినిమా షురూ అంటున్నారు. దీంతో ఈసారైనా అనుకున్నది అనుకున్నట్లు అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గత సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూట్‌ మొదలవ్వాల్సి ఉంది. ఇంతవరకు కాలేదు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus