Jr NTR: ఎన్టీఆర్ సూపర్ కూల్ పిక్స్ వైరల్

  • May 27, 2023 / 10:57 AM IST

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ హీరోగా ఎదిగారు. ‘ఆర్.ఆర్.ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో పాటు ఇటీవల రీ రిలీజ్ అయిన ‘సింహాద్రి’ సినిమా కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. వేరే దేశాల్లో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది. రీ రిలీజ్ మూవీకే.. ఈ రేంజ్లో రెవెన్యూ వస్తే.. ఇక కొత్త సినిమా వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోపక్క ఎన్టీఆర్ ..

కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నాడు. (Jr NTR) ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. 2024 సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యనే ఎన్టీఆర్ తన 40వ పుట్టినరోజు వేడుకలను.. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. మే 20న తన ఇంట్లోనే బర్త్ డే సెలబ్రేషన్స్ ను జరుపుకున్నాడు ఎన్టీఆర్.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ సూపర్ కూల్ గా కనిపిస్తున్నాడు. అవినాష్ గోవారికర్ ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus