టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఎక్కువ శాతం మంది రెమయనిరేషన్ తోనే సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే, అలాకాకుండా కేవలం రెమ్యునిరేషన్ కోసమే సినిమాలు చెయ్యకుండా సినిమా రైట్స్ ని కొనుక్కునే వారు కోడారు ఉన్నారు. అదే క్రమంలో సినిమా వసూళ్లలో వచ్చిన లాభాలు తీసుకునే హీరోలు సైతం ఉన్నారు…గతంలోకి వెళితే….ఒకప్పుడు చిరంజీవి ఏరియా రైట్స్ తన రెమ్యూనరేషన్ గా తీసుకుంటే.. ఆ తరువాత మహేష్ బాబు సినిమాలో తనూ ఓ భాగమై సినిమాలు తీస్తున్నాడు. అయితే బడా హీరోల్లో ఒకడైన ఎన్టీఆర్ ఇప్పుడు అదే పద్దతిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
విషయంలోకి వెళితే….ఎన్టీఆర్ వక్కంతం వంశీతో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఒక సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాని అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు…అయితే ఈ సినిమాకు సంభందించినంతవరకూ కళ్యాణ్ రామ్ దగ్గర కేవలం 1116 రూపాయలను అడ్వాన్సుగా తీసుకుని.. తక్కిన రెమ్యూనరేషన్ సినిమా పూర్తయ్యాక దానిని పంపిణీదారులకు అమ్మేస్తే వచ్చే లాభాల్లో తీసుకుంటాడట ఎన్టీఆర్. అదే క్రమంలో ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ కాస్త భారీగానే దాదాపు 40కోట్ల వ్యయంతో నిర్మిస్తుంది. మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే అటు ఎన్టీఆర్ కే కాదు, ఇటు కల్యాణ్ రామ్ వంటి డెడికేటెడ్ నిర్మాతకు కూడా మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఈ సినిమా వీళ్ళకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.