యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం దేవర (Devara) సినిమా షూట్ తో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూట్ జరుగుతోంది. విలేజ్ సెట్ లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యాన్స్ అప్ డేట్ అప్ డేట్ అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో మే 20వ తేదీన దేవర నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇవ్వాలని దర్శకనిర్మాతలకు తారక్ సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సెంటిమెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో రిజెక్ట్ చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. (Srinivasa Kalyanam) శ్రీనివాస కళ్యాణం సినిమా కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ విని రిజెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టెంపర్ (Temper) తర్వాత పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కొన్ని కథలను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించగా ఆ సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తారక్ అంచనాలకు అనుగుణంగా పూరీ జగన్నాథ్ సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) సినిమాతో మోస్తరు హిట్ సాధించిన పూరీ లైగర్ (Liger) సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. ప్రస్తుతం (Double iSmart) డబుల్ ఇస్మార్ట్ తో పూరీ బిజీగా ఉన్నారు.
త్రివిక్రమ్ (Trivikram Srinivas) ఒక కథ చెప్పగా ఆ కథను కూడా తారక్ రిజెక్ట్ చేశారు. ఆ సినిమా (Guntur Kaaram) గుంటూరు కారం అని కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇలా తారక్ రిజెక్ట్ చేసిన కథలతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలవుతున్నాయి. కథల జడ్జిమెంట్ విషయంలో తారక్ కు ఎవరూ సాటిరారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో తారక్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?