Jr NTR: అదిరిపోయే లైనప్ ను సిద్ధం చేసుకున్న తారక్.. ఆ జాగ్రత్తలతో?

2011 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు (Jr NTR) కెరీర్ పరంగా పెద్దగా కలిసిరాలేదు. తారక్ హిట్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించినా ఆ సమయంలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేశాయి. అయితే టెంపర్ (Temper) సినిమా సక్సెస్ తర్వాత తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం రాలేదు. ఒక సినిమా తర్వాత మరొక సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేసే విజయాలను అందుకున్నారు.

ఆర్ఆర్ఆర్ (RRR) సక్సెస్ తో ఇతర ఇతర భాషల ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు సైతం దగ్గరైన జూనియర్ ఎన్టీఆర్ ఐదు సినిమాలతో అదిరిపోయే లైనప్ ను సిద్ధం చేసుకున్నారు. దేవర పార్ట్1 (Devara) సినిమాతో తారక్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి దేవర షూటింగ్ పూర్తి కానుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

త్వరలో వార్2 షూటింగ్ లో పాల్గొననున్న తారక్ దేవర2 సినిమా షూటింగ్ లో ఈ ఏడాది డిసెంబర్ నుంచి పాల్గొననున్నారని భోగట్టా. ఎన్టీఆర్ దేవరలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ మొదలు కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

అయితే అధికారిక ప్రకటన వస్తే మాత్రమే ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ కన్ఫ్యూజన్ దూరమవుతుంది. పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగేలా జూనియర్ ఎన్టీఆర్ లైనప్ ఉండగా తారక్ సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus