విజయ్ దేవరకొండ దర్శకుడికి ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడా?

  • March 31, 2020 / 09:45 PM IST

ఎన్టీఆర్ పూర్తి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పైనే ఉంది. ఈ చిత్రం 2021 జనవరి 8న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్ ను రాజమౌళి… కొమరం భీమ్ గా ప్రెజెంట్ చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్న మరో హీరో రాంచరణ్ వీడియోని రిలీజ్ చేయగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మాటల్లో చెప్పలేము.

ఇక కొమరం భీమ్ ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక ‘ఆర్. ఆర్.ఆర్’ పూర్తయ్యాక ఎన్టీఆర్ తన తరువాతి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయడానికి రెడీ అవుతున్నట్టు ఇది వరకే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ విషయం పై తరుణ్ భాస్కర్ నే ప్రశ్నిస్తే…”ఆల్రెడీ ఎన్టీఆర్ ను కలిసి ఓ కథ వినిపించాను.ఇంకా ఎన్టీఆర్ నుండీ రెస్పాన్స్ రాలేదు. వస్తే ముందు నేనే ఆనౌన్స్ చేస్తాను.” అంటూ చెప్పుకొచ్చాడు. కాస్త పేరున్న డైరెక్టర్… లేదా ఆల్రెడీ పెద్ద హీరోలతో చేసిన దర్శకులతో అయితేనే ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తాడు అనే రూమర్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉంది. మరి ఈ విజయ్ దేవరకొండ డైరెక్టర్ కు ఎన్టీఆర్ వెంటనే ఛాన్స్ ఇస్తాడా?

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus