‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ పై స్పందించని జూ.ఎన్టీఆర్, రాజమౌళి..!

  • January 17, 2019 / 09:15 AM IST

టాలీవుడ్ లో ఒక సినిమాకు మంచి హిట్ టాక్ వస్తే సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతుంటారు. ఈ మధ్య అది మరింత పెరిగింది. ఒక హీరో సినిమా హిట్టయితే మరో హీరో ట్వీట్ చేయడం వంటివి ఈ మధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విడుదలైన సమయంలో ఇండస్ట్రీలో స్టార్లు అందరూ సినిమా పై ప్రశంసల జల్లు కురిపించారు. మహేష్ బాబు, నాగార్జున, రాజమౌళి, లాంటి వారు సినిమా గురించి ట్విట్టర్లో ట్వీట్లతో రచ్చచేసారు.ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఏకంగా టీమ్ మొత్తానికి స్పెషల్ పార్టీ కూడా ఇచ్చి ఆశ్చర్య పరిచాడు.

అయితే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విషయంలో అలాంటి రిటర్న్ గిఫ్టులు ఏవీ రాకపోవడం గమనార్హం . ఇంతవరకు ఒక్క మహేష్ బాబు తప్ప సినిమా తారలు ఎవరూ పెద్దగా స్పందించకపోవడం ఆలోచించతగ్గ విషయం. ముఖ్యంగా… జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య బయోపిక్ పై ఇప్పటివరకు స్పందించలేదు. తన అభిమానులందరికీ.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన తారక్ తన తాతయ్య బయోపిక్ గురించి మాత్రం నోరు విప్పకపోవడం సంచలనంగా మారింది. ఇక నాగార్జున కూడా ఈ చిత్రం పై స్పందించలేదు. అక్కినేని నాగేశ్వరరావు కథలో ప్రాముఖ్యతనిస్తూ స్వయంగా తనమేనల్లుడే నటించినప్పటికీ… నాగ్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నాడు. ‘ఎన్టీఆర్’ కి అతి పెద్ద అభిమానినని చెప్పే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ చిత్రం పై ట్విట్టర్లో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.చిన్న సినిమాల పై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే రాజమౌళి ఇప్పుడు తన అభిమాన నటుడి బయోపిక్.. అందులోనూ తన స్నేహితుడు సాయి కొర్రపాటి కోప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రం పై స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus