NTR, Ram Charan: చరణ్ కు మాత్రమే కాదు … ఎన్టీఆర్ కు కూడా ఆ సీనే ఇష్టమట..!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం మార్చి 25 న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ లు స్టార్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తీరుకి అంతా ఫిదా అయిపోయారు. సినిమా విడుదలై 2 వారాలు పూర్తికావస్తోన్నప్పటికీ వసూళ్ళ సునామీ ఇంకా తగ్గలేదు. అతి త్వరలో ఈ మూవీ రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేయనుంది.

ఈ క్రమంలో పోటీగా కొత్త సినిమాల జోరు కూడా పెరగనున్న నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ ఆర్ ఆర్ ఆర్ ను లాంగ్ రన్ పడేలా చేయడానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 6న ముంబైలో ‘ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ’ని నిర్వహించారు. అక్కడ మీడియాతో ముచ్చటించిన ఆర్ఆర్ఆర్ టీమ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి హీరోలకి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఫేవరెట్ సీన్ ఏంటి అన్నది కూడా చెప్పుకొచ్చారు.

ముందుగా రాంచరణ్ తనకు సినిమాలో ఇష్టమైన సన్నివేశం గురించి చెబుతూ.. ‘ ఇంటర్వల్ ఫైట్ సీన్ ఇష్టమని చెప్పుకొచ్చాడు ‘ అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి.. ‘ నాకు కూడా అదే సన్నివేశం ఇష్టమని. ఇద్దరి మధ్య అపార్ధాలు స్టార్ట్ అయ్యే ఆ సన్నివేశంతోనే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని, ఇద్దరూ అప్పటి వరకు ఉన్న మారు వేషాన్ని తీసేసి కొట్టుకునే సన్నివేశం కాబట్టి థియేటర్లలో జనాలు బాగా కనెక్ట్ అయ్యారని, ఆ పోరాట సన్నివేశంలో అంత ఎమోషన్ ను దట్టించడం కేవలం దర్శకుడు రాజమౌళికి మాత్రమే సాధ్యమని వీరు వివరించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus