Jr NTR, Rishab Shetty: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిషబ్ శెట్టి కాంబోలో సినిమా రానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాలో నటించేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉంది. తారక్, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి తాజాగా కలవగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ కావడం జరిగింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలిసి నటిస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సలార్ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించడంతో బాక్సాఫీస్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అవుతుందని పాన్ ఇండియా లెవెల్ లో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఊహించని స్థాయిలో షేక్ చేస్తుందని అభిమానులు చెబుతున్నారు.

ఎన్టీఆర్ కు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను హీరోగా నటిస్తున్న ప్రతి సినిమా స్పెషల్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం అక్కడి ప్రేక్షకులకు అర్థమయ్యేలా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ సత్తా చాటుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

అయితే తారక్ మాత్రం రెమ్యునరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవడం లేదా సినిమాకు సొంత బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా సినిమా హిట్టైతే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న పద్ధతి సరైనదే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. తారక్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే సరికొత్త రికార్డులు ఖాయమని చెప్పవచ్చు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus