Jr NTR: తారక్ ధరించిన ఈ షూస్ ఖరీదు అన్ని వేలా.. ఎంతంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)   కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ప్రస్తుతం ముంబైలో ఉన్న తారక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా సందీప్ రెడ్డి వంగాను  (Sandeep Reddy Vanga)  కలిసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో తారక్ ధరించిన షూస్ ఖరీదు 83 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

Jr NTR

“balenciaga” అనే కంపెనీకి సంబంధించిన షూస్ ను తారక్ (Jr NTR) ధరించగా ఆన్ లైన్ లో ఈ మోడల్ షూస్ ధర 995 డాలర్లుగా ఉంది. తారక్ షూస్ ఖరీదు నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత దేవర (Devara)  సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. దేవర ప్రమోషన్స్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాలతో బిజీగా ఉండగా తారక్ కెరీర్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. తారక్ సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే తారక్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలను క్రాస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ బిజీగా ఉండగా చెప్పిన తేదీలకే ఈ సినిమాలు థియేటర్లలో విడుదలైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. తారక్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండగా ఈ కాంబినేషన్ నిజంగా సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.

 ‘ది గోట్‌’ ఫలితం.. ఆ ఐపీఎల్‌ టీమ్‌ని, స్టార్‌క్రికెటర్‌ని లింక్‌ పెట్టిన దర్శకుడు

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus