జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పునీత్ రాజ్ కుమార్ ఫొటో.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్..!

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూశారు. నేడు పునీత్ ప్రధమ వర్థంతి.. ఏడాది గడిచినా ఆయన మరణించారనే వార్తను కుటుంబ సభ్యులు, అభిమానులు, కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. నటుడిగా, గొప్ప మానవతావాదిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు పునీత్.. ఆయన ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీ, కర్ణాటక ప్రభుత్వం, అభిమానులు, ఇతర రంగాలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.

‘వుయ్ మిస్ యూ పునీత్’ అంటూ ఆయనతో తమకున్న అనుంబధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఫొటోను చూసి కన్నడ, తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పునీత్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి కుటుంబం యొక్క అనుబంధం ఈనాటిది కాదు.. సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ సోదరుల్లా మెలిగారు. వారి తర్వాత వారి వారసులు నందమూరి బాలకృష్ణ – శివ రాజ్ కుమార్, వారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – పునీత్ రాజ్ కుమార్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది.

బాలయ్య 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో శాతకర్ణి జీవిత చరిత్రను వివరించే పాటలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివన్న. శివ రాజ్ కుమార్ సినిమాల ఫంక్షన్లకు బెంగుళూరు వెళ్లి కన్నడలో మాట్లాడి తమ్ముడిని బ్లెస్ చేశారు బాలయ్య. పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘చక్రవూహ్య’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘గెలయా గెలయా’ అనే కన్నడ పాట పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు. వీరి అభిమానుల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. పునీత్ మరణవార్తతో నందమూరి కుటంబం షాక్‌కి గురైంది.

బాలయ్య, పునీత్ పార్థివదేహం వద్ద విలపించడం, శివన్నను, వారి కుటంబాన్ని ఓదార్చడం చూశాం. తారక్ కూడా అన్నలేడనే బాధతో భావోద్వేగానికి లోనయ్యాడు. తారక్, తనకు పునీత్ అన్న అంటే ఎంత ఇష్టమనేది చేతల్లో చేసి చూపించాడు. తన ఇంటిలో పునీత్ ఫొటో పెట్టుకున్నాడు. ఈ పిక్ బయటకి ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఎన్టీఆర్ ఇంట్లో పునీత్ ఫోటో అంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయనకి పునీత్ మీద ఇంత ప్రేమ ఉందా అంటూ పునీత్ ఫ్యాన్స్, తారక్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతూ పునీత్ రాజ్ కుమార్‌కి నివాళులు అర్పిస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus