Jr NTR: బుచ్చిబాబు కోసం ఎన్టీఆర్‌ ఒప్పేసుకున్నాడా?

  • March 31, 2021 / 11:57 AM IST

ఎన్టీఆర్‌కు ప్రయోగాలు కొత్త కాదు… అందుకే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. పాత్రల ఎంపిక, నటన అన్నింటిలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ జోరులోనే ప్రస్తుతం కొమరం భీమ్‌గా కనిపింబోతున్నారు. అయితే అంతకుమించి అనే రేంజిలో తర్వాతి సినిమాలో కూడా ప్రయోగం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ డేర్‌ స్టెప్‌ తీసుకోబోతున్నాడట. అది కూడా తనకెంతో ఇష్టమైన ‘ఉప్పెన’ బుచ్చిబాబు కోసమట. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో వసూళ్ల ఉప్పెన పుట్టించిన బుచ్చిబాబు సానా నెక్స్ట్‌ ఏంటి అనేది ఇంకా తెలియడం లేదు.

చాలామంది కథలు చెప్పాడని వార్తలొస్తున్నా… ఏదీ ఇంకా ఫైనల్‌ అయినట్లు వార్తలు రాలేదు. అయితే ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు బుచ్చిబాబు ఓ కథ చెప్పాడని ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల టాక్‌. అది కూడా మామూలు కథ కాదట ఇందులో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపిస్తాడని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ… వార్త అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎన్టీఆర్‌ కొత్త సినిమాల లైనప్‌ చూస్తే… బుచ్చిబాబుకు స్లాట్‌ దక్కాలంటే చాలా సమయం పట్టేలా ఉంది.

ఎందుకంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుంది. ఆ వెంటనే ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేయాలి. ఈ రెండూ అయ్యేసరికి ఏడాదిన్నర పడుతుందని టాక్‌. అంటే బుచ్చిబాబు అన్నాళ్లు ఆగాలా.. ఆగుతాడా.. ఆగితే మంచిదా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే అలా ఆగిన సుజీత్‌ పడ్డ ఇబ్బంది చూశాం. రాధాకృష్ణ సినిమా అయితే ఇంకా రానేలేదు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus