Jr NTR: దేవర కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ లో కష్టపడుతున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమా రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లను పూర్తి చేశారు. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అంటే యాక్షన్ సీన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మాత్రం యాక్షన్ సీన్స్ మరింత ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం తారక్ పడిన కష్టం మామూలు కష్టం కాదని మరి కొందరు చెబుతున్నారు.

దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా రిలీజ్ సమయానికి ఆ బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాయామాలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని సరికొత్త లుక్ తో తారక్ మెస్మరైజ్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్2 సినిమాను పూర్తి చేసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

త్వరలో వార్2 మూవీ షూటింగ్ కూడా మొదలుకానుందని ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో కొత్త కథలు వినడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల ఫలితాలను బట్టి తారక్ సినిమాల ఎంపిక డిసైడ్ కానుందని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా (Jr NTR) ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ అదుర్స్ అనేలా ఉండనుందని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇతర ఇండస్ట్రీలలో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus