జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండగా దేవర సినిమా హిట్టవ్వడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ముఖ్యం కాగా ఎన్టీఆర్ కంటే మరో ఐదుగురికి ఈ సినిమా సక్సెస్ సాధించడం మరింత కీలకం అని చెప్పవచ్చు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అటు మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఇటు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) లకు నిర్మాతగా ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) గత సినిమా ఆచార్య ఫ్లాప్ కాగా ఈ డైరెక్టర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు. బన్నీ (Allu Arjun) కోసం సిద్ధం చేసిన కథతో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొరటాల శివ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాతో లక్ పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే వీళ్లిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది. దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా 90 శాతం థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. దేవర మూవీ అన్ని ఏరియాల బిజినెస్ పూర్తైందని తెలుస్తోంది.
దేవర సినిమా హిందీ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. దేవర హిందీ వెర్షన్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. కరణ్ జోహార్ (Karan Johar) హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం గమనార్హం. దేవర విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోగా రిలీజ్ తర్వాత సైతం రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.