Jr NTR: ఎన్టీఆర్ కొత్త వాచ్ ఖరీదు ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి బోమ్మకనిపిస్తోంది..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తొలిసారిగా దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ దాదాపు రూ.70కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కు డ్రైవింగ్ అంటే పిచ్చి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన గ్యారేజీలో ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అలాగే ఆయనకు వాచ్ లంటే కూడా మక్కువ ఎక్కువ. తన దగ్గర అత్యంత ఖరీదైన వాచెస్ కూడా ఉన్నాయి. నిత్యం ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ కు సంబంధించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త వాచ్ కొన్నట్లు తెలుస్తోంది. వాచ్ ధర గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.

మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇవ్వ హీరో సంగీత్ శోభన్.. ఎన్టీఆర్ ను కలవడం జరిగింది. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై అందరి కన్ను పడింది. ఈ బ్రాండెడ్ వాచ్ MB &F కంపెనీకి చెందినది. దీని గురించి ఫ్యాన్స్ గూగుల్లో వెతకడం ప్రారంభించారు.

దాని విలువ ఏకంగా 1.66 కోట్ల రూపాయలట. ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ డబ్బులతో ఓ సినిమా తీసెయొచ్చు అంటున్నారు. దేవర సినిమా అయిపోయిన వెంటనే (Jr NTR) ఎన్టీఆర్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus